టిడిపి ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 29, మహానంది:
మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంసీ ఫారంలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జి బన్నూరి రామలింగారెడ్డి పిలుపుమేరకు గ్రామ సర్పంచ్ అస్లాం భాష ఆధ్వర్యంలో ఆదివారం రెండవ రోజు”ఇదేం కర్మ మన రాష్ట్రా నికి” కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అస్లాం భాష మాట్లాడుతూ వైసీపీ పాలనతో రాష్ట్రం అదోగతి పాలైందని, జగన్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.