బడుగు బలహీన వర్గాల ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు కెసిఆర్
👉ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
👆కుర్తి రావుల చెరువు గ్రామస్తులు స్టేజి దగ్గర నుంచి గ్రామం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు .
మల్దకల్:ఈ రోజు గద్వాల నియోజకవర్గంలో మల్దకల్ మండలం పరిధిలోని బూడిద పాడు , అమరవాయి, నాగర్ దొడ్డి, కుర్తి రావులచెరువు, గ్రామంలో బిసి, ఎస్సీ, 1కోటి 30 లక్షలు రూపాయలు తో కమ్యూనిటీ హాల్స్ ( ఫంక్షన్ హాల్స్) నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఎమ్మెల్యే గారికి సర్పంచ్లు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం నోట్ పుస్తకాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు
ఎమ్మెల్యే గారికి చేతుల మీదుగా బీసీ, ఎస్సీ, కమ్యూనిటీ హాల్ (ఫంక్షన్ హాల్స్ ) నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగినది.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కొరకు అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజల లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుంది.
⚡ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుంది అదే విధంగా దాన్ని కులాలను గౌరవిస్తూ వారికి పూర్వ వైభోగం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా అహర్నిశలు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది.
⚡ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ గారితో ప్రత్యేకంగా నిధులు కేటాయించుకొని ప్రతి గ్రామంలోని పేద ప్రజలు వివాహ, శుభ కార్యాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ లోను ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఫంక్షన్ హాల్ లో బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు కేటాయించడం జరిగినది.
⚡ దేశంలో దళితులను గత ప్రభుత్వాలను ఓట్లు వేసే యంత్రాలుగాఉపయోగించుకున్నారు.కానీ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు దళితులకు అన్ని వర్గాలతో సమానంగా ప్రాధాన్యం వారు కూడా ఎదగాలని దళిత బంధువులు పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి దళితుల అభ్యున్నతకు కృషిచేసిన నాయకుడు ఏకైక నాయకుడు దేశంలోనే సీఎం కేసీఆర్ గారిని గర్వంగా కొనియారు.
ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి రైతుబంధు, 24 గంటల కరెంట్, రైతు భీమా, గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంటింటికి మంచినీళ్లు ఆసరా పింఛన్, వంటి పథకాల అమలు చేయడం జరుగుతుంది.
40 ఏళ్ళు అధికారం అప్పగిస్తే ఆపద సమయంలో పారిపోయారు. నేను మాయమాటలు చెప్పడం లేదు. మీరు ఆశీర్వదించారు. నేను కూడా నిత్యం మీ మధ్యలో ఉన్నాను.
పక్క రాష్ట్రంలో తెలంగాణ లో అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి
కులాలు, మతాల పేరుతో ప్రాంతాల్లో చిచ్చులు పెడతాను. కార్యక్రమాలకు చేపట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. మనమంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గతంలో పైరవీకారులుంటేనే పథకాలు వచ్చేవి. ప్రస్తుతం పార్టీలకు అతీతంగా అర్హులకు అందరికీ పథకాలు అమలు చేస్తున్నాం
ప్రజలు బిజెపి పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు .
ప్రజలందరూ టిఆర్ఎస్ పార్టీ ని నన్ను మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు.
👉 ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి , PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపి వీరన్న, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న , మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న, కో.ఆప్షన్ నెంబర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీతారాం రెడ్డి విక్రమ్ సింహరెడ్డి చక్రధర్ రెడ్డి తూమ్ కృష్ణారెడ్డి , శేషంపల్లి నర్సింహులు, అజయ్, నరసింహారెడ్డి, భాస్కర్, ఎల్లప్ప, నారాయణ, ఆంజనేయులు, నరేందర్, మధు నాయకి, జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మహమ్మద్ అలీ, ఆంజనేయులు, భాస్కర్ గౌడ్, తిమ్మరాజు, పరుశురాముడు, యువ నాయకులు ప్రవీణ్, మహేష్, కీరణ్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.