సీనియర్ నటి జమున (86) గారి మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, భాషల్లో 150 చిత్రాల్లో నటించిన జమున గారు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకున్నారని అన్నారు. 1980లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికై, జమున గారు ప్రజలకు ఎంతో సేవ చేసారని మంత్రి తెలిపారు. జమున మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. జమున కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.