పెండింగ్ చాలానాలపై స్పెషల్ డ్రైవ్: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

👆 వాహనంపై ఉన్న చలనలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ

👉వాహనాదారులు నిబంధనలు పాటించాలి

గద్వాల పట్టణం: వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ వాహనాదారులకు తెలియజేశారు.శుక్రవారం గద్వాల పట్టణ కేంద్రంలోని గాంధీచౌక్ పరిధిలో ట్రాఫిక్ ఎస్ఐ మరియు తన సిబ్బంది ఆధ్వర్యంలో పెండింగ్ చలానాలు,ట్రిపుల్ రైడింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,రాష్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాల పై గద్వాల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.3లేదా అంత కన్నా ఎక్కువగా చలాన్ లు ఉన్న వాహనాలను ఆపి చలానాలు క్లియర్ చేసిన తర్వాత వాహనాలను పంపించారు.పెండింగ్ చలానా లు చెల్లించని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.మీ వాహనంపై పెండింగ్ చాలన్ లు ఉన్నట్లయితే మీ సేవ,నెట్ బ్యాంకింగ్,పేటియం ద్వారా వెంటనే చెల్లించగలరు.లేనట్లయితే పోలీస్ వారి తనిఖీలలో మీ వాహనం సీజ్ చేయబడుతుందని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా అయన గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ వాహనదారు లకు పలు సూచనలు చేశారు. 1.బైక్ మీద వెళ్లే వారు తప్పకుండా హెల్మెట్,కారు లో వెళ్లే వారు అందరూ సీట్ బెల్ట్ ధరించాలి. 2.రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయకూడదు. 3.మధ్యం సేవించి వాహనం నడపకూడదు. 4.సెల్ ఫోన్ లో చూస్తూ లేదా మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు. 5.ట్రాఫిక్ సిగ్నల్స్ ని గమనిస్తూ డ్రైవింగ్ చేయవలెను. 6.అధిక వేగంతో ప్రయాణం చేసి ప్రమాదాల భారిన పడకూడదు. 7.ఆటో లలో పరిమితికి మించి ఎక్కించుకోరాదు. 8.వాహనానికి కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి.నెంబర్ ప్లేట్ తీసేసి తిరుగుచున్న వాహనాలు,ఫేక్ నెంబర్ ప్లేట్ వేసుకున్న,నెంబర్ ప్లేట్ సరిగా కానీపించకుండా స్టిక్కెర్స్ వేయడం,పెయింట్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న వాహన దారులపై నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ వారి వాహనాల ను సీజ్ చేయడం జరుగుతుంది. ఫేక్ నెంబర్ వేసుకొని తిరుగుచున్న వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని తెలియజేసారు.అదేవిధంగా తల్లిదండ్రులకు తమ పిల్లలు మైనర్లు అయితే వాహనాలు ఇవ్వకూడదని, రోడ్లపైకి వస్తే వారికి వాహనాలు ఎలా నడపాలో తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని అయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది రమేష్, శివకుమార్, రామకృష్ణ, కృష్ణ నాయుడు,గోపాల్ పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!