రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరుక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి సీసీ కెమెరాలు అమర్చడం కోసం దాతలు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 20,000 రూపాయలను విరాళంగా ప్రకటించినట్లు గ్రామ సామాజిక సేవకుడు శ్యాంసుందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదవ తరగతి పరీక్ష కేంద్రాలకు సంబంధించి సీసీ కెమెరాలు సౌకర్యం ఉండాలి. అవి లేకపోతే ఎగ్జాం సెంటర్ రద్దు అవుతుందని తెలిపారు. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలియజేయగా సీసీ కెమెరాలు అమర్చడానికి ముందుకు వచ్చినట్లు శ్యాంసుందర్ తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు కోసం 20,000 రూపాయలను విరాళంగా అందజేసినట్టు తెలిపారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పశమోని బుగ్గ కృష్ణ, ర్యాకల రమేష్, ర్యాకల చిన్న బాలయ్య, సర్పంచ్ కాగుల కిష్టయ్య తదితరులు కలిసి 20వేల రూపాయలు అందజేసినట్లు శ్యాంసుందర్ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సహకరించిన దాతలకు శ్యామ్ సుందర్ కృతజ్ఞతలు తెలిపారు..