అంగన్వాడి సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో కోడూరులో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నినాదాలతో దద్దరిల్లింది.
కనీస వేతనం 26,000 ఇవ్వాలని. పేస్ యాప్ లు, రద్దు చేయాలని, ఐదు సంవత్సరాల టి ఏ డి ఏ, ఇవ్వాలని, ఆందోళన. ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని!
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటీ మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అంగన్వాడి కార్యకర్తలు ఐ సి డి ఎస్ ఆఫీసు నుండి, తాసిల్దార్ ఆఫీస్ వరకు, ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించడం జరిగినది. అనంతరం ఎమ్మార్వో కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, మాట్లాడుతూ ఏడాది అంగన్వాడి మహిళలు వైసీపీ ప్రభుత్వంలో, నేటికీ జీతాలు చెల్లించకపోవడంతో సంక్రాంతి జరుపుకో లేక పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హామీ మేరకు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసి మూడున్నర సంవత్సరాలైనా అమలు జరగలేదన్నారు. ఇచ్చిన మాట అమలు చేయాలన్నారు. గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు నవరత్నాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, గౌరవ వేతనతో పని చేయించుకుంటూ, అనేక పనులు అప్పచెప్పుతో బారాలు మోపుతున్నారని తెలిపారు. కొత్తగా పేస్ యాప్ తీసుకురావడంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. పేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఐదు లక్షలు ఇవ్వాలని, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని. డిమాండ్ చేశారు. 2017 నుండి, ఐదు సంవత్సరాలుగా, టిఎడిఎలు, రాకుంటే ఎలా పని చేస్తారని ప్రశ్నించారు.ఆయాలకు కాళీ ఏర్పడిన వర్కర్ పోస్టులో ప్రమోషన్ ద్వారా నియమించాలని డిమాండ్ చేశారు. అధికారులు, రాజకీయ వేదింపులు అరికట్టాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు, పెంచాలన్నారు, గ్యాస్ ప్రభుత్వమే, ఇవ్వాలి అన్నారు. రేషన్ సరుకులు అంగన్వాడి సెంటర్ కి చేర్చాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ అందలేదన్నారు. సొంత బిల్డింగులు కట్టించాలని, రెంట్ చార్జీలు పెంచాలని, అవి కూడా ఏప్రిల్ నుండి ఇవ్వలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు మండల కార్యదర్శి దాసరి జై చంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యమాలనుచడానికి, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జీవో ఒకటి తెచ్చిందని తక్షణం రద్దు చేయాలన్నారు. అంగన్వాడి సెంటర్లను సచివాలయ పరిధికి తెచ్చి, విజిటింగ్ ల పేరుతో సిడిపిఓలు సూపర్వైజర్లు, ఎమ్మార్వో ఎండిఓలో, అవమానిస్తున్నారన్నారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, అంతవరకు ఇతర పనులు చెప్పొద్దని తెలిపారు. అనంతరం ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యల పై అధికారులు దృష్టికి తీసుకెళ్తాన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు, ఎన్ రమాదేవి, మాట్లాడుతూ, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడి సెంటర్ గా మార్చాలని, హెల్పర్ పోస్ట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఉపాధ్యక్షులు, లింగాల యానదయ్య, కోశాధికారి, కరతోటి హరి నారాయణ, ప్రాజెక్టు వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధాకుమారి, ప్రాజెక్టు సహాయ కార్యదర్శి వై సుజాత, గౌరవ అధ్యక్షులు వనజ కుమారి, కోశాధికారి జి పద్మావతి. ఉపాధ్యక్షులు కె. నిర్మల. పి.దుర్గా, ఈ. శిరీష, టీ ప్రభావతి, పి రోజా, వై. లీలావతి, ఈశ్వరమ్మ, ఆర్ మునీంద్ర ,శోభ జై కుమారి, లక్ష్మీ నరసమ్మ, సాయి కుమారి, తదితరులు పాల్గొన్నారు.