జాబ్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి పని కల్పించాలి-ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా పిడి రామచంద్రారెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 23, మహానంది:
జాబ్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి పని కల్పించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా పిడి రామచంద్రారెడ్డి అన్నారు.సోమవారం మహానంది మండలం అల్లినగరం గ్రామం నందు ఉపాధి పనులను పరిశీలించారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రోజువారి కూలీ 257 రూపాయలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని, ప్రతి గ్రామ పంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ రామేశ్వర్ రెడ్డి, టి ఏ మాణిక్యమ్మ, ఎఫ్ ఏ సోమన్న పాల్గొన్నారు.