త్రాగునీరు కలుషితం అవుతున్న పట్టించుకోరా
స్టూడియో 10 టీవీ న్యూస్,జనవరి 25, మహానంది:
తాగునీరు కలుషితం అవుతున్న పట్టించుకోరా అని పలువురు మహానందిలోని పార్వతీపురం వాసులు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఇలా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు భాగాన త్రాగునీటి పైప్ లైన్ లీకేజ్ కావడంతో ఆ నీటితో పాటు కలుషితమైన నీరు కూడా వస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఇదే వారి ఇంట్లో అయితే ఇలాంటి నీరే తాగుతార అనేది ప్రశ్నార్థకంగా మారింది. విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా రోడ్డు యువతల వైపు కూడా త్రాగునీరు పైపు లీకేజీ కావడంతో వృధాగా పోతుంది. దీనిపై అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. రానున్న శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి నీరే కూడా తాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు అధికారులు ప్రజలకు శుద్ధి చేసిన జలాన్ని అందించాలని వాటర్ ట్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేస్తున్న పట్టీ పట్టనట్లు వివరిస్తున్నారని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పైప్లైన్లు లీకేజీ కాకుండా మురుగునీరు అందులో చేరకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నిధుల లేని కారణంగా గాలికి వదిలేస్తున్నట్లు సమాచారం.