*ప్రజల పిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి – మేయర్ శిరీష*
*తిరుపతి*
*తిరుపతి నగరంలోని సమస్యల పరిష్కారం కోసం వస్తున్న పిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యలయంలో మేయర్ డాక్టర్ శిరీష, అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణలు సోమవారం పిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిశీలించమని తగు ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ కు 13 పిర్యాధులు, స్పందన కార్యక్రమంకు 16 పిర్యాదులు వచ్చాయన్నారు. కార్పొరేటర్ నరసింహాచారి స్పందనలో వినతిపత్రం ఇస్తూ తిరుపతి నగరంలో మరణిస్తున్న బిచ్చగాళ్ళు, అనాధ మృత దేహాలను తరలించేందుకు మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయాలని కోరగా, కౌన్సిల్ దృష్టికి తీసుకెల్లి ఏర్పాటు చేద్దామన్నారు. సిపిఐ నాయకులు తమ వినతిపత్రంలో కొరమీనగుంట దేవుడు కాలనీలో తెలుగుగంగ నీటి పైపులు వేయించాలని, అదేవిధంగా మట్టిరోడ్డు నిర్మించాలని మేయర్ కి తెలపగా, ఎస్.ఈ మోహన్ కి ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అంతవరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. ఉపాధ్యాయనగర్లో మెయిన్ రోడ్డు పాడైపోయిందని, కొత్త రోడ్డు వేయాలని, అన్నారావు సర్కిల్లో యుడిఎస్ మ్యాన్ హోల్ కవర్ పోయిందని, ఎస్.ఎల్.వి నగర్లోని అపార్ట్మెంట్ ప్రక్కన కాలువలు లేనందున మురుగు నీరు ఇండ్ల ముందుకు వస్తున్నదని, ఉపాధ్యాయ నగర్ ఐదవ క్రాస్ లో పందుల బెడద వున్నదని, మరికొన్న చోట్ల డ్రైనేజ్ సమస్యలపై వచ్చిన పిర్యాదులను తమ సిబ్బంది పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని మేయర్ డాక్టర్ శిరీష, అదనపు కమిషనర్ సునిత, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, ఎం.ఇ వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం, మేనేజర్ చిట్టిబాబు, మెప్మా వెంకటరమణ, శానిటరి సూపర్ వైజర్ చెంచెయ్య, సూపర్డెంట్లు పి.రవి, గాలి సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.*