జగనన్న కాలనీలొ లబ్ధిదారులతో శంకుస్థాపన చేసిన ఎంపీడీవో…. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రమైన త్రిపురాంతకం గ్రామపంచాయతీ పరిధిలోని త్రిపురాంతకం జగనన్న కాలనీ లో గృహాలు మంజూరైన లబ్ధిదారులు సోమవారం గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎంపీడీవో మరియాదాసు ల ఆధ్వర్యంలో సంయుక్తంగా గృహాలు నిర్మించుకునేందుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ గృహాల నిర్మాణంలో ముగ్గురు లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు వారితో ఎంపీడీవో మరియాదాస్ మరియు గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ఇంజనీర్ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కలిసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి
మరియదాస్.మాట్లాడుతూ ఉన్నతి ద్వారా గృహాలు నిర్మించుకునేందుకు రుణము తీసుకొని ప్రతి ఒక్కరూ గృహాలు నిర్మించుకోవాలని వీలైనంత తొందరగా ఉన్నతిలో లోను తీసుకొని గృహాలు నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేసుకోవాలని ఆయన లబ్ధిదారులను కోరారు ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం సచివాలయం గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు