*యాదవులకు సముచిత స్థానం కల్పించాలి – మణిగోపాల్ యాదవ్*
*తిరుపతి*
రాష్ట్రంలో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని అన్ని రాజకీయ పార్టిలను ఉద్దెశించి తీర్మానం చేసినట్లు, తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రెస్పాన్సిబుల్ యాదవ్ జాయింట్ యాక్షన్ వెల్ఫేర్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు చిత్తూరు, తిరుపతి బాలాజీ జిల్లాల నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మణి గోపాల్ యాదవ్ తెలిపారు. సమావేశంలో ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల నుండి యాదవ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు, యాదవ కులస్తులకు తగిన ప్రాధాన్యత లేదని చెబుతూ రాష్ట్ర జనాభాలో సుమారు 14 శాతం కలిగి ఉన్న యాదవ కులస్తులకు రాజకీయంగా, సామాజికంగా తగిన ప్రాధాన్యత లభించడం లేదని, రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కనీసం 25 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటరీ స్థానాలకు యాదవ కులస్తులకు కేటాయించవలసిందిగా తీర్మానం చేసినట్లు మణిగోపాల్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెస్పాన్సిబుల్ యాదవ్ జాయింట్ యాక్షన్ వెల్పేర్ సొసైటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఎ.బాలాజీ యాదవ్, సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షరాలు గాయత్రీ, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు యాదవ్, మంజుల, జయప్రకాష్ యాదవ్, బాలాజీ యాదవ్, చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాల యాదవ నాయకులు పాల్గొన్నారు.