*భావి తరాలకు ఉపయోగ పడే కార్యక్రమానికి తమ వంతుగా ముందుకు వస్తున్న దాతలకు అభినందనలు*
– డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు
* కాపు కల్యాణ మండప నిర్మాణానికి రావులపాలెం కు చెందిన ధాతలు రూ. లక్ష రూపాయల విరాళం.*
డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం ఆలమూరు గ్రామంలో స్థానిక భువనేశ్వరి చెరువు వద్ద నిర్మిస్తున్న కాపు కల్యాణ మండప నిర్మాణానికి రావులపాలెం చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బరంపురం నాగేశ్వర రావు 50000 మరియు రావులపాలెం శ్రీ కృషణదేవరాయలు కాపు సంఘం అద్యక్తులు నంధం వీర వెంకట సత్యనారాయణ 50000 రూపాయిల చొప్పున మొత్తం లక్ష రూపాయల సహకారం ఆదివారం స్థానిక, పిఠాపురం నియోజక వర్గం పరిశీలకులు, వైఎస్సార్ సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, ప్రముఖ పారిశ్రామిక వేత్త, జాతీయ అవార్డ్ గ్రహీత, మండల కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు, స్వగృహం వద్ద నగదు అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ భావి తరాలకు ఉపయోగ పడే కార్యక్రమానికి తమ వంతుగా ముందుకు వచ్చి వారి గుప్పెలు విప్పి సహాయం అందచేసిన వారి కుటుంబాలను అభినందించారు.ఈ కార్య క్రమంలో శ్రీ కృష్ణ దేవరాయల కాపు సంఘం అధ్యక్షుల చల్లా నానాజీ, గౌరవ అధ్యక్షులు రామానుజుల శేషగిరరావు, సెక్రటరీ ఎలుగుబంట్లు సాయి, ట్రేజరర్ సిరిగినిడి పట్టాభి,చల్లా సూర్యారావు, గంటా విర్రజు ,చల్లా వెంకటేశ్వర రావు శ్రీపతి సూర్యనారాయణ, వెంపల సత్తిబాబు, కోనసీమ శివ, తాకసి సత్తిబాబు,చల్లా పెరుమాళ్లు,డీపీ రావు, మరియు కమిటీ సభ్యులు పాల్గోన్నారు.