తెలంగాణ రాష్ట్రానికి గ్రామాలు పట్టుకొమ్మలు

తెలంగాణ రాష్ట్రానికి గ్రామాలు పట్టుకొమ్మలు – గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి పరచడమే నా లక్ష్యం

బిజ్వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎంపిపి నిధుల నుండి 74 లక్షల వ్యయంతో అత్యాధునికమైన తరగతి గదులకు నిధులు మంజూరు

ప్రజలకు అందుబాటులో వుండి సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ప్రజా సమస్యలను తీర్చిదిద్దడమే నా ధ్యేయం

బిజ్వారం ముస్లిం సోదరులకు షాదిఖాన మంజూరు అవ్వడంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కి,ఎంపిపి వై.రాజారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ముస్లిం సోదరులు

విజయవంతంగా ముగిసిన బిజ్వారం గ్రామసభ

మల్దకల్ మండలం (సామాజిక తెలంగాణ పత్రిక) : శుక్రవారం బిజ్వారం గ్రామంలో పి.లక్ష్మన్న గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి రాజేష్ పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్దకల్ మండల ఎంపిపి వై.రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో బిజ్వారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.అదేవిధంగా గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డెబ్బై నాలుగు లక్షలతో ప్రత్యేక తరగతి గదులకు గాను నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలకు కాంపౌండ్ వాల్ అవసర నిమిత్తమై నాల్గున్నర లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

అదేవిధంగా గ్రామంలో అన్ని కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులోకి తేవడం నా వంతుగా కృషిచేస్తానన్నారు.ఈ యొక్క కమ్యూనిటీ హాళ్ల కు సంబంధించి నిధులు కూడా మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం వల్ల పేద ధనిక తేడాలేకుండా గ్రామంలో అందరూ పెళ్ళిళ్ళకు కానీ ఎలాంటి శుభకార్యాలు జరిగిన అందరికి అన్ని విధాలా ఉపయోగపడతాయని అన్నారు.గ్రామంలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామ ప్రజలకు అందుబాటులో వుండి గ్రామ ప్రజలకు మరింత ప్రభుత్వ సేవలు అందించాలని కోరారు.

గ్రామంలో ముస్లిం సోదరులకు షాదిఖాన అవసరం నిమిత్తమై ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు వెంటనే స్థలం చూపించి నిర్మాణం చేపట్టుటకు నిధులు మంజూరు చేయించి ముందుకు రావడంతో ముస్లిం సోదరులు హర్షధ్వనులతో పెద్దఎత్తున ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కి మండల ఎంపిపి వై.రాజారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ చాలా రోజులనుండి శుభకార్యాలు జరుపుకోవడానికి ఇబ్బందులు వున్న సమయంలో మా సమస్యను గుర్తించి అతి తక్కువ సమయంలోనే నెరవేర్చేందుకు ముందుకు రావడంతో ఆనందంగా ఉందని అన్నారు.

గ్రామసభలో గ్రామస్థులు పలు సమస్యలను సభాదృష్టికి తీసుకువచ్చారు.ప్రధానంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ధామంకు సంభందించిన పనులు పూర్తి కావడంతో తొందరలోనే శ్మశాన వాటికను ప్రారంభించాలని కోరడంతో సమస్యను విన్న ఎంపిపి వై.రాజారెడ్డి,గ్రామ సర్పంచ్ లక్ష్మన్న వెంటనే స్పందిస్తూ త్వరలోనే స్మశాన వాటికను ప్రారంభించి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు.
అదేవిధంగా గ్రామంలో ప్రధాన సమస్యగా వున్నా ఏకలవ్య కులస్థులకు సంభందించిన పందుల గూడులను గ్రామం మధ్యలో ఉండడం వల్ల గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా పందుల గూడుకు సంభందించి గ్రామంలో వూరిచివర భాగాన వున్న ప్రభుత్వ భూమిలో గూడులను నిర్మించుకోవాలని ఏకలవ్య కులస్థులకు సూచించడం జరిగింది.గ్రామంలో ఏ సమస్య ఉన్నాకాని తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే మా వంతుగా సమస్యను నెరవేర్చి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఆయన అన్నారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందత్వ నిర్మూలనకై ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి “వెలుగు కార్యక్రమం”త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ కంటి వెలుగు శిబిరానికి సంభందించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్షేమ పథకాలను గ్రామస్థులు వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి.లక్ష్మన్న, ఉపసర్పంచ్,సోమేశ్వర్ రెడ్డి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు,రంగన్న సింగిల్ విండో డైరెక్టర్,రాజేష్ పంచాయితీ కార్యదర్శి,శేఖమ్మ ఏఎన్ఎం,వార్డ్ మెంబర్లు,ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు,అంగన్ వాడి కార్యకర్తలు,ఆశా వర్కర్లు,విద్యుత్ శాఖ సిబ్బంది,మాజీ కో ఆప్షన్ సభ్యుడు అహమ్మద్,వెంకటేష్ మాజీ ఉపసర్పంచ్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఎస్.తిరుమలేష్
సామాజిక తెలంగాణ న్యూస్ రిపోర్టర్
జోగులాంబ గద్వాల జిల్లా.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!