పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇటుక బట్టీలు..

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇటుక బట్టీలు..

అనుమతులు లేకుండా నిర్వహణ

బాల కార్మికుల నిర్మూలనపై కన్నేయండి సర్

కార్మిక చట్టాలకు తూట్లు… కూలీలతో వెట్టి చాకిరి

బాల కార్మికులతో వెట్టి చాకిరి చేస్తున్న ఇటుక మాఫియా నిర్వాహకులు

షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిస్తు న్నాయి. అయితే బతుకుదెరువు కోసం ఎక్కడికెక్కడి నుంచో వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలు అష్ట కష్టాలు పడుతున్నారు. వెట్టి చాకిరి చేయించుకునే ఇటుక బట్టి నిర్వాహకులు నియోజక వర్గంలో అడ్డు అదుపు లేకుండా పోతుంది. కనీస వేతనం లేకుండానే కూలీల జీవితాలు అత్యంత దుర్భర పరి స్థితుల్లో గడిచి పోతున్నాయి. మరోవైపు ఇటుక బట్టి వాలు కుమ్మకై యజమానుల ఆగరాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం వందల సంఖ్యలలో ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటిలో సుమారు 500 మంది బాల కార్మికులు పనిచేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూలీలను తప్పించు కుంటున్న ఇటుకబట్టి యాజమానులు వారితో బానిసల్లా పని చేయించే కుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి ఇక్కడ పనికి కుదిరితే కూలీలు తిరిగి బయటపడటం కష్టమని చెప్తున్నారు. ఒకవేళ అలాంటి సహాసమే చేస్తే యజమానులు వారిని తీవ్రంగా వేధిస్తారని తెలుస్తుంది. చాలీచాలని కూలీలు ఇచ్చి కనీస కార్మిక చట్టాలు వర్తింప చేయకుండా వారితో పని చేయించుకుంటున్నారు.


చదువు కోవాల్సిన బాల్యంలో వెట్టిచాకిరి చేపిస్తున్న ఇటుక బట్టి నిర్వాహకులు

కార్మిక చట్టాలు కూడా వర్తింపచేయకుండా వారితో పని చేయించుకుంటున్నారు. బాల కార్మికులతో పనులు చేయించడం చట్టరీత్య నేరం అయినా అవి పట్టింపు లేకుండా యదేచ్ఛగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కోట్లు కొల్లగొడుతూ ఇటుక బట్టి వ్యాపారాలు కోట్లు గడిస్తున్నారు. కేవలం తిండి పెడితే చాలు ఇక్కడే పడి ఉంటారన్న రీతిలో వారి చేత ఇటుక బట్టి యజమానులు వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. మరోవైపు ఇటుక బట్టికి మట్టి కావాలంటే రెవెన్యూ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సి వుంటుంది. కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ చెరువుల్లో ఉన్న మెత్తటి మట్టిని దర్జాగా సేకరించి పెద్ద పెద్ద గుట్టలుగా మట్టిని నిలువ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అక్రమ ఇటుక బట్టీలను నివారించే నాధుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు,చైల్డ్ లేబర్ అధికారులు స్పందించి బాల కార్మికుల చేర నుంచి విముక్తి కల్పించాలని, ఇలాంటివి పునర్వృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!