శ్రీశైలం ప్రాజెక్టును నమ్మి 40 ఏళ్లుగా మోసపోతునేవున్నాం.
రాయలసీమకు నికరజలాలు అందించండి.
ఈ నెల 28 న చలో సిద్దేశ్వరం జయప్రదం చేయండి.
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 13, మహానంది:
మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో శుక్రవారం రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా మండలం రైతు నాయకులు నన్నపనేని పెద్ద బాబు, పోలిశెట్టి పుల్లయ్యలు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో జరిగే చలో సిద్దేశ్వరం విజవంతం చేద్దాం అన్నారు.అదేవిధంగా రాయలసీమ కరువు, దారిద్య్రం, వలసల నివారణ కోసమైనా కృష్ణానదిఫై సిద్దేశ్వరం వద్ద బ్యారేజీ కం వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే కృష్ణా- పెన్నార్ ప్రాజెక్టు పోగొట్టు కున్నామని అన్నారు.తెలుగుగంగ నుంచి 15 టీఎంసీ ల నీరు చెన్నైకి తరలిపోతున్నా చూస్తూ వుండే పరిస్థితి నెలకొందని, శ్రీశైలం గేట్లు తెరిస్తే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఉందని, శ్రీశైలం గేట్లు సగం తెలంగాణకు, మనకు సగం సగం చేశారన్నారు. శ్రీశైలం గతంలో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు నేడు ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడుతుందో అందరికి తెలిసిన విషయమేనన్నారు. నాగార్జునసాగర్ కు అటునుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు వదిలిపెడుతున్నారు. ఏటా వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా మన నేతలు పట్టించుకోవడం లేదన్నారు.కేంద్రప్రభుత్వం సుమారు 11వందల కోట్లతో అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం 167K జాతీయ రహదారి పేరుతో తెలంగాణ నుంచి కృష్ణా నదిఫై సోమశీల – సిద్దేశ్వరం మధ్య ఐ కానిక్ (తీగల ) బ్రిడ్జి నిర్మాణం చేపడుతుందని వివరించారు.ఆకలిచావులు ఆపాలంటే రాయలసీమకు నికరజలాలు కావాలని , చెరువులు,కుంటల ఆక్రమణలు తొలగించి నీటితో నింపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న చలో సంగమేశ్వరం -సిద్దేశ్వరం ప్రజా ప్రదర్శనకు మహానంది మండలం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చలో సిద్దేశ్వరం కరపత్రాలు విడుదల చేసి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు తమ్మడపల్లె కాసు వెంకటేశ్వర్లు, బుక్కాపురం సాలెకమ్మ పుల్లారెడ్డి, పి. చలమయ్య, నంది శ్రీనివాస్, పులిమద్ది మౌలాలి, షేక్ ఖాసీం, వెంకటేశ్వర్లు, శ్రీనగరం రైతులు పాల్గొన్నారు.