రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలి
-మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 13, మహానంది:
రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటిం చాలని మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మహానంది మండలంలోని బుక్కాపురం రైతు భరోసా కేంద్రంలో రైతులతో ఆయన సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ సమీపంలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో నమోదు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. అలా జరగని పక్షంలో రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి మరియు పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయ సహకారాలు లేదా ఇన్సూరెన్స్ సౌకర్యం కోల్పోయే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ సహకరించాలని కోరారు. తాను ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటానని ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తానని ఇక్కడ పరిష్కారం కాకపోతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని రసాయనిక , క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించాలని సూచించారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. నాణ్యమైన ఎరువులు విత్తనాలు ఉపయోగించినప్పుడే అధిక దిగుబడులు రావడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బందితోపాటు పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు