విస్తీర్ణంలో భూమి (0000) సున్నా… అయినా పట్టాదారు పాసుపుస్తకం..
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 12, మహానంది:
విస్తీర్ణంలో భూమి (0000) సున్నా … అయినా పట్టాదారు పాసుపుస్తకం మంజూరు. మహానంది మండల తాసిల్దార్ కార్యాలయంలో రైతుకు చేదు అనుభవం ఎదురైంది.మహానంది మండలం లోని ఒక గ్రామానికి చెందిన రైతు తమకున్న పొలాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని కొన్ని రోజుల క్రితం దరఖాస్తు చేయడం జరిగింది.అయితే అ రైతుకు గతంలో పట్టాదారు పాస్ పుస్తకం విడుదల అయింది. ఆన్లైన్లో నిక్షిప్తం కానీ మిగిలిన కొంత భూమిని ఆన్లైన్ చేసి పాస్ బుక్ లో నమోదు చేయాలని గత కొన్ని రోజుల క్రితం దరఖాస్తు చేయడం జరిగింది. అయితే అందుకు కార్యాలయ అధికారి కూడా సరే అనడంతో అ రైతు సంతోషంలో మునిగిపోయారు.అయితే తీరా పట్టాదారు పాసు పుస్తకం చేతికి అందే వరకు అందులో గతంలో ఉన్న ఖాతా నెంబర్ ఉన్న అప్లై చేసిన దానికంటే విరుద్ధంగా తాను పొందుపరచని విస్తీర్ణం రావడంతో పాటు అందులో కూడా అన్ని సున్నాలు రావడం తో అవాక్కైనట్లు రైతు పేర్కొన్నారు. నీకు పొలం లేదని అందుకే అన్ని సున్నాలు ఉన్నాయని అందుకే మంజూరైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పొలం లేని వారు తమకు పొలము లేదంటూ మహానంది మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారు ఆన్లైన్ చేసుకోవడానికి అనుమతిస్తూ అన్ని సున్నాలు అంటే పొలం లేదన్నట్లు ఒక పాస్ పుస్తకం మంజూ రుకు అవకాశం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలు స్తుంది. ఇది పేదలకు ఎంతగానో ఉపయోగపడు తుందని ఆనంద వ్యక్తం చేస్తున్నారు .పెన్షన్ల కోసం కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కానీ ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. మరి అందరూ మహానంది మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఉచితంగా వ్యవసాయ భూమి లేనట్లు పాస్ పుస్తకం మంజూరు చేస్తారు. ఇదేం ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారా.. ఇది నిజం. మరియొక నిజం ఏమంటే మీరు తమకు పొలం ఉన్నా లేకున్నా పొలం కొలతలకు దరఖాస్తు చేస్తే సంబంధిత అధికారి సంతకం లేకుండానే పొలం కొలత వేసినట్లు అనుమతులు ఇక్కడ మంజూరు చేయడం సర్వసాధారణం. మరొక విశేషం ఏమంటే స్థానిక గ్రామ విఆర్ఓ లకు కొలతలు వేసే సందర్భంలో సంబంధిత అధికారులు తెలియజేయడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి అధికారుల పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇవి ఏమీ అధికారులకు పట్టనట్లు లేవు. ఎవరైతే మాకేంటి.. అనే విధంగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఉచిత సలహా ఏమంటే మరలా దరఖాస్తు చేసుకుంటే మీ పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తాం అంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.