ఆకస్మికంగా రైతు భరోసా కేంద్రాల తనిఖీ.
రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేస్తున్న నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి టి మోహన్ రావు.
క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంటలను పరిశీలిస్తున్న నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 12, మహానంది:
మహానంది మండల పరిధిలోని గోపవరం,సీతా రామపురం రైతు భరోసా కేంద్రాలను ఆకస్మికంగా నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి టి మోహన్ రావు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గురువారం మండలంలోని రైతు భరోసా కేంద్రాలలో రిజిస్టర్లను తనిఖీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆయన వివరాల మేరకు ఈనెల 15వ తారీకు లోగా పిఎం కిసాన్ పెండింగ్ ఉన్న రైతులు వెంటనే ఈ కేవైసీ చేయాలని, అలాగే ఆధార్ నెంబర్ కు సంబంధించి వెంటనే సవరణ చేయాలని, అదేవిధంగా పిఎం కిసాన్ కు అర్హత ఉన్న రైతులకు ధ్రువీకరణ ను వెంటనే పూర్తి చేయాలని రైతు భరోసా సిబ్బందికి ఆయన ఆదేశించారు.అలాగే రైతులకు టీయోస్ మీద, డిజిటల్ అక్షరాస్యత మీద అవగాహన కల్పించడం జరిగిందని, రైతు భరోసా సిబ్బంది రవి పంట నమోదును వెంటనే వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు.అలాగే గ్రామాల రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి నాగేశ్వర్ రెడ్డి, వి ఎస్ ఏ హరిత, వి ఏ ఏ లక్ష్మీకాంత్, గ్రామస్థాయి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాధవ రామిరెడ్డి, మరియు గ్రామాల రైతులు పాల్గొన్నారు.