కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.*

*కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.*

— కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి ముక్కంటి.

*_సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ముక్కంటి హెచ్చరించారు.గురువారం మండల కేంద్రమైన ఆలమూరు మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు,గ్రామ సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,వీఆర్వోలు,ఎంపీటీసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతీ గ్రామాల్లో ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అనగా కోడిపందాలు,జూదం, గుండాట,పేకాట,భోగమేళాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు.గ్రామ,మండల స్థాయి,కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.అలాగే గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు మాట్లాడుతూ గ్రామ సర్పంచులు దృష్టికి ఇటువంటి కోడి పందాలు,జూదం వంటి విషయాలు వస్తే మేము సహకరించబోమని,అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలియజేసి.అటువంటి వారు ఎవరు కూడా మాకు తెలియకుండా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తారని తెలియజేసి గతంలో మండల స్థాయి అధికారుల ప్రోత్సాహంతో ప్రతి గ్రామంలో సంక్రాంతి పురస్కారాల్లో భాగంగా పాడి రైతులకు ఆవుల అందాల,పాల ఉత్పత్తి పోటీలు,ముగ్గుల పోటీలు, కబడ్డీ,కోకో వంటి సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించే వారిని ఇప్పుడు ఎవరూ కూడా అధికారులు సహకరించడం లేదని,ఇలా సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించడం వలన గ్రామాలలో కోడి పందాలు, జూదం వంటి వాటిపై ప్రజలలో దృష్టి మరలచే అవకాశం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం రావులపాలెం సర్కిల్ సీఐ ఎన్.రజిని కుమార్ మాట్లాడుతూ మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని తెలియజేసి సంక్రాంతి కోడి పందాలను కట్టడి చేసేందుకు పోలీసులు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నారు. కోడి పందాలు నిర్వహించే గ్రామాల్లో అనుమానితులపై ముందుగానే బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు.చట్ట విరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, తాసిల్దార్ జి.లక్ష్మీపతి, ఎంపీడీవో కే.జాన్ లింకన్, స్థానిక ఎస్సై ఎస్.శివప్రసాద్, పలు శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు,వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు._*

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!