ప్రభుత్వ విప్, శాసన సభ్యులు చిర్ల ఆదేశాల మేరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం*

*ప్రభుత్వ విప్, శాసన సభ్యులు చిర్ల ఆదేశాల మేరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం*

డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ,కొత్తపేట నియోజక వర్గం, మండల కేంద్రమైన ఆలమూరు గ్రామములో కొత్తపేట నియోజక వర్గ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు బుదవారం విస్తృత సాయి సమావేశం నిర్వహించారు.కార్యక్రమం లో ఆసుపత్రి సూపరిండెంట్ జీ గొపిరామ్,మరియు కమిటీ సభ్యులు పాల్గొని పలు రకాల అంశాలపై చర్చలు జరిపారు.ప్రధానంగా స్త్రీ ప్రసూతి వైద్యులు ( గైనకాలజిస్ట్) నియామకం,ఆసుపత్రిలో అవసరమైన సిబ్బంది ,ఈ సి జి మిషన్ కొనుగోలు, పల్స్ ఆక్సిమీటర్స్,బీపీ మిషన్,మరియు లెబ్ పరికరాలు,డెంటల్ చైర్ మరామత్తులు,మరియు అనేక అవసరతల కొరకు చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని శాసన సభ్యులు దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూల స్పందన విషయమై ఆసుపత్రి సిబ్బంది,కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు .స్థానిక వైఎస్సార్ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,జాతీయ అవార్డ్ గ్రహీత,ప్రముఖ పారిశ్రామిక వేత్త,పిఠాపురం నియోజక వర్గం పరిశీలికులు డాక్టర్ చల్లా ప్రభాకర్ కూడా స్వయంగా శాసన సభ్యులతో మాట్లాడి అనేక విషయాలు చర్చించారు .అవసరమైతే తాను కూడా ఆసుపత్రి అభివృద్ధి కార్య క్రమాలకు తన వంతుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల ఉపద్యక్ష్యులు వాసం సెట్టి దుర్గా భవాని సాయిబాబా, ఆలమూరు ఉప సర్పంచ్ చల్లా లక్ష్మి భూషణం,ఎంపీటీసీ ఉన్నమట్ల విజయకుమారి రవీంద్ర ,పి ఎ సి ఎస్ మెంబెర్,శ్రీ కృష్ణ దేవరాయల కాపు సంఘం అధ్యక్షులు చల్లా నానాజీ , వార్డు మెంబర్ యేరు కొండ గణేష్ , ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!