మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ36.89లక్షలు
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 11, మహానంది:
మహానంది క్షేత్రంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.36,89,430 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లో భక్తులు 43 రోజులపాటు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బందితో లెక్కించామన్నారు. ఇందులో స్వామి, అమ్మవారి ఆలయాలలోని హుండీలతోపాటు ఇతర హుండీలను లెక్కింపు నిర్వహించగా రూ.36,89,430 లక్షలు వచ్చిందని అన్నారు.ఆలయాల ద్వారా 35,89,017 వేలు అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ.74,214, వేలు,గోసంరక్షణ రూ.26,199 వేలు 20 గ్రాముల బంగారం,743 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా తరుపున బనగానపల్లె డివిజన్ ఇన్స్పెక్టర్ పి .హరిచంద్రారెడ్డి,ఏఈవో ఎర్రమల మధు, ధర్మకర్తలు బి. వెంకటేశ్వర్లు,వీరభద్రుడు, జి. మల్లి కార్జునరావు, మహానంది సిబ్బంది, భ్రమరాంబిక సేవా సమితి సేవకులు, శ్రీ కృష్ణ దత్త సాయి సేవా సమితి సేవకులు తదితరులు పాల్గొన్నారు.