జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి -తాసిల్దార్ జనార్దన్ శెట్టి
స్టూడియో 10 టీవీ న్యూస్ జనవరి 11, మహానంది:
జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తాసిల్దార్ జనార్దన్ శెట్టి తెలిపారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, అక్కడి ఇళ్ల నిర్మాణాల పనితీరును వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తాసిల్దార్ జనార్దన్ శెట్టి లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరితగతిన ఇల్లు నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇళ్లు నిర్మించని వారు వెంటనే నిర్మించుకోవాలని,లేదంటే పట్టాలు రద్దు అయ్యే అవకాశం ఉందని,కట్టిన వారికి వెంటనే బిల్లులు చెల్లిస్తామని లబ్ధిదారులకు తెలిపారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండా మధు సూదన్ రెడ్డి,సర్పంచ్ చంటి, ఎంపీడీవో శివ నాగ జ్యోతి, హౌసింగ్ ఏఈ వాసు దేవుడు,ఏపీవో మనోహర్, విఆర్ఓలు, వెంకట రాముడు, చంద్ర మోహన్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, గ్రామ నాయకులు, గజ్జ పెద్ద పకీరయ్య, రవి స్వామి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.