పాకాల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి జల్లికట్టు కోడిపందాలపై నిషేధం సీఐ రాజశేఖర్

పాకాల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి జల్లికట్టు కోడిపందాలపై నిషేధం సీఐ రాజశేఖర్

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ నందు సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పండుగ సందర్భంగా మరియు ప్రభుత్వం మరియు కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు జంతు హింస నిషేధం కాబట్టి అందరు కలిసి జంతు హింస చేయకూడదని జల్లికట్టు కోడిపందాలు మరియు ఆవులు ఎద్దుల తరిమేది కోడికి కత్తి కట్టి పందాలడం సాంప్రదాయమని జంతు హింస చేయడం పేకాట గోళీల అడ్డం పరుగు పందాలు పేరుతో జంతువుల్ని వేటాడి చంపడం అవన్నీ నిషేధించబడ్డాయి కాబట్టి ఇవి ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారి పైన కేసులు కట్టి జైలు పంపించడం జరుగుతుంది అలాగే ఇవి ఎక్కడైనా జరుగుతున్నాయని సమాచారం అందిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు ప్రజల సహకారం ఉండాలని కోరారు. జంతు హింస నేరం వాటిని నివారిస్తామని సిఐ రాజశేఖర్ తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!