టీటీడీ కి “జీఎస్టీ” మినహాయింపు ఇవ్వాలి!నవీన్

*టీటీడీ కి “జీఎస్టీ” మినహాయింపు ఇవ్వాలి!నవీన్*
* తిరుపతి
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఏం చేస్తున్నారు దర్శనాలు చేసుకోవడం… అయినవారికి దర్శనాలు చేయించడమే పనిగా పెట్టుకున్నారా శ్రీవారి దర్శనానికి వచ్చే బీజేపీ కేంద్ర మంత్రుల ద్వారా ఢిల్లీకి వెళ్లి జిఎస్టి కౌన్సిల్ చైర్మన్,సభ్యులను కలిసి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత లేదా!

టిటిడి ధర్మకర్తల మండలి అంటే దర్శనాలు చేయించడం కాదు శ్రీవారికి భక్తులు భక్తితో సమర్పించే ప్రతి పైసాకు జవాబుదారీతనంగా వుంటూ సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ దుబారా ఖర్చులు తగ్గించాల్సిన బాధ్యత ఉంది!

తిరుమలలో కాటేజీల మరమ్మత్తులు చేపట్టి వసతి సౌకర్యాలు పెంచి భక్తులకు అందించడం శుభ పరిణామం కానీ గత 30 సంవత్సరాలుగా అద్దె గదుల ధరలు పెంచలేదన్న సాకుతో ఒక్కసారిగా భారీగా పెంచడం భక్తులకు భారమవుతుంది!

టిటిడి వసతి సముదాయాలలో అదనంగా కల్పిస్తున్న సౌకర్యాలకు అనుగుణంగా కొద్ది కొద్దిగా అద్దె ధరలు పెంచేలా టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు పునఃపరిశీలించాలి!

టిటిడి ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు జిఎస్టి మినహాయింపు పై GST council chairman కు గతంలో ఇచ్చిన విజ్ఞప్తి ఏమైంది ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రానికి కావాల్సిన అప్పుల కోసం అనేక పర్యాయాలు ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మల సీతారామన్ గారి వద్దకు వెళ్తారే మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి కొనుగోలు చేస్తున్న ముడి సరుకులకు,శ్రీవారి భక్తులకు కేటాయిస్తున్న వసతి గదులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని ఏనాడైనా ఏపీ ఆర్థిక మంత్రి అడిగారా!

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లాభాపేక్షతో కాకుండా మెరుగైన వసతి కల్పించాల్సిన బాధ్యత టిటిడి అధికారులపై వుంది!

ఢిల్లీలోని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ సభ్యులు “ఉత్సవ విగ్రహాలలా” మారారు ప్రతి 90 రోజులకు ఒకసారి ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టీటీడీ కి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని,అధికారులను కలిసిన దాఖలాలు లేవు!

తిరుమల ఆధ్యాత్మిక కేంద్రమే తప్ప వ్యాపార కేంద్రం కాదు అన్న విషయాన్ని పాలకులు అధికారులు గుర్తించాలి భక్తులపై భారం మోపే విధంగా ఇస్తానుసారంగా శ్రీవారి,పద్మావతి అమ్మవారి సేవ టికెట్ల ధరలు పెంచారు,ప్రసాదాల ధరలు పెంచారు,అద్దె గదుల ధరలు పెంచారు ఇలా పెంచుకుంటూ పోతే భక్తులు తిరుమల కొండ వైపు చూడాలంటే భయపడే పరిస్థితిలు వస్తాయి!

టిటిడి చైర్మన్ జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ కు జిఎస్టి మినహాయింపు పై ఇచ్చిన లేఖ తనకు ఇస్తే శ్రీవారి భక్తునిగా CGST యాక్ట్ 2017 సెక్షన్ 11 ప్రకారం చట్టపరంగా ముందుకెళ్తానని నవీన్ అన్నారు!

టీటీడీ లో ఓ నిర్ణయం తీసుకునే ముందు తిరుమల శ్రీవారి ఆలయం ముందు “భక్తుల అభిప్రాయ సేకరణ సంతకాల సేకరణ” చేసిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రకటించాలని,భక్తుల మనోభావాలను గౌరవించాలని శ్రీవారి భక్తినిగా డిమాండ్ చేస్తున్నాను!

ధర్మో రక్షతి రక్షితః

నవీన్ కుమార్ రెడ్డి
శ్రీవారి భక్తులు స్థానికులు
కాంగ్రెస్ నేత
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!