గాయత్రీ చదువు ఆగొద్దు..!
కమ్మ మహిళా సేవా సమితి
హర్షితా గాయత్రి పోల చదువుకు ఆర్థిక సహాయం అందించిన మానవతా వాదులు
ఆడపిల్ల చదువు ఇంటికే కాదు ఈ సమాజానికే వెలుగు. అలాంటి ఆడపిల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడి చదువు ఆపొద్దనే ఉద్దేశంతో కమ్మ మహిళా సేవాసమితి ముందుకు వచ్చింది. ఓ నిరుపేద విద్యార్థిని అర్ధాంతరంగా తన చదువు ఆపకుండా తమ వంతు సాయం చేసేందుకు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. జనవరి 10 వ తేదీ నాడు పాతూరి సత్యనారాయణ, ఇంద్రాదేవి మనవడు పాతూరి సాత్విక్ జన్మదినాన్ని పురస్కరించుకొని కమ్మ మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి హర్షిత గాయత్రి చదువుకోసం 12,116 లను వారి తండ్రి శివకుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాతూరి సత్యనారాయణ, పాతూరి ఇంద్రాడేవి, పినపాక మంగా దేవి, నువ్వుల రమాదేవి పాల్గొన్నారు. హలో షాద్ నగర్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన మానవతమూర్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు..