సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ గారికి! మంగంపేట త్రివేణి కార్మికులు, సన్మానం!
అన్నమయ్య జిల్లా సిఐటియు అధ్యక్షులుగా, ఏపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, ఏకగ్రీవంగా ఎన్నికైన సిహెచ్ చంద్రశేఖర్ గారికి, మంగంపేట, మైనింగ్ వర్కర్స్ యూనియన్, కు 2016 నుంచి గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్న, సిహెచ్ చంద్రశేఖర్ గారిని శుక్రవారం సాయంత్రం కోడూరు సిఐటియు ఆఫీసులో, మంగంపేట మైనింగ్ వర్కర్స్ యూనియన్, అధ్యక్ష కార్యదర్శులు, త్రివేణి కార్మికులు గౌరవంగా, సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న నన్ను గుర్తించే, జిల్లా అధ్యక్షులు గాను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, ఎన్నుకొని బాధ్యతలు అప్ప చెప్పారని, తెలిపారు. తన పైన ఉంచిన అభిమానాన్ని కి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం, నిరంతరం సమరసిల పోరాటం జరిపేది సిఐటియు మాత్రమే అన్నారు. కులమతాలు కు అతీతంగా ఐక్యంగా సమస్యలపై పోరాటం చేయాలని, అదే తనకు ఇచ్చే గౌరవం అని తెలిపారు. సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగంపేట మైనింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, పుల్లగంటి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, మాట్లాడుతూ, యూనియన్ కు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ, వేతనాలు పెంపు చేయడం, వీ డి ఏ, బోనస్సు, ఎనిమిది గంటల పని కోసం, ఓవర్ టైం అలవెన్స్, బోనస్సు, కోసం, పోరాటం చేసిన, అగ్రిమెంట్ చేసిన, మా కు అండగా నిలబడినందుకు, సన్మానిస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో, సురేంద్ర, వై. రాజశేఖర్, ఎస్. సుదర్శన్, డి.శంకర్ రాజు. ఐ. సుబ్రహ్మణ్యం ఎన్. శివశంకర్, జి. వెంకటేష్, కే శివ నాగరాజు, జి. శ్రీనివాస్ రెడ్డి, ఎం సుబ్రహ్మణ్యం, వై శివయ్య, జనార్ధన్ ఎస్ హరి, ఎం శ్రీకాంత్, కే వెంకట్ రాజ్, గుణశేఖర్, అంజి, ప్రకాష్.