*టీటీడీ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కింద కష్టపడుతున్న ఉద్యోగులకు వారి కుటుంబాలకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించండి టిటిడి చైర్మన్, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి రాయలసీమ కన్వీనర్ నవీన్ విజ్ఞప్తి…!*
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకన్న వరమిచ్చినా పూజారి వరమివ్వనట్లు తయారైంది అని సుమారు 15 వేలమంది టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పరిస్థితి ఉందని
తిరుమల తిరుపతి దేవస్థానం కు అనుబంధంగా ఉన్న విద్యాసంస్థలలో,వైద్యశాలలో,ఎస్వీబీసీ,ట్రాన్స్ పోర్ట్,కంప్యూటర్ విభాగాలలో, తిరుమల తిరుపతి లోని వసతి సముదాయాలలో,ఫారెస్ట్, వాటర్ వర్క్స్,
సులబ్ కాంప్లెక్స్ పారిశుద్ధ కార్మికులతో సహా వివిధ విభాగాలలో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగస్తులకు సైతం వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించండి!తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 10 సంవత్సరాలుగా సుమారు 15,000 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్,శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ సొసైటీ, ఎఫ్ ఎం ఎస్, సులభ్ ద్వారా శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందిస్తున్న వారి కుటుంబ సభ్యులకు సైతం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఒకరోజులో రెండు షిఫ్టులుగా కొంత సమయం కేటాయించి దర్శనానికి అనుమతించాలి!
టిటిడిలో రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు మమేకమై బ్రహ్మోత్సవాలను, శ్రీవారి పర్వదినాలను విజయవంతం చేస్తూ తిరుమల పరిశుభ్రతలో,క్లీన్ అండ్ గ్రీన్ లో టీటీడీ నెంబర్ వన్ స్థానాన్ని సాధించి భారత దేశ ప్రథమ పౌరుల ప్రశంసలు పొందడానికి ప్రధాన కారకులైన టీటీడీ కార్మికుల ( రెగ్యులర్ ఎంప్లాయిస్ ) కుటుంబాలకు వైకుంఠ ద్వార శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత టిటిడి ఉన్నతాధికారులపై ఉంది! అన్నారు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో టీటీడీ వారు ఏర్పాటు చేసిన అనేక కౌంటర్లలో స్థానికులకు టోకెన్లు ఇవ్వడం అలాగే తిరుమలతో పాటు తిరుపతిలో విష్ణు నివాసం శ్రీనివాసం వసతి సముదాయాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా రాత్రి పగళ్ళు కష్టపడుతూ మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు!వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినాన్ని 10 రోజులు పురస్కరించుకుని తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శన కౌంటర్లు ఏర్పాటు చేశారు,టిటిడి రెగ్యులర్ ఉద్యోగస్తులకు,మీడియా మిత్రులకు ప్రత్యేక దర్శన అవకాశం కల్పించిన టిటిడి చైర్మన్ ఉన్నతాధికారులు కార్మికుల శ్రమను గుర్తించి వారికి కూడా వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తిరుపతి జిల్లా రాయలసీమ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు