ఆస్పత్రికి వెళ్లి ఫించన్ అందజేసిన వెల్ఫేర్ అసిస్టెంట్
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 07, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన గంగవరం లాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నంద్యాలలోని ఇండస్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.లాల్ రెడ్డికి ఇటీవల కొత్తగా మంజూరు అయిన ఫించన్ డబ్బును ఇవ్వటానికి వెళ్లగా వారి కుటుంబీకులు అనారోగ్యంతో నంద్యాలలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్ కి తెలియజేశారు. వెంటనే విషయం తెలుసుకున్న సచివాలయం 1 వెల్ఫేర్ అసిస్టెంట్ సిహెచ్ .లింగమయ్య శనివారం ఆస్పత్రికి వెళ్లి పింఛను అందజేశారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసిస్టెంట్ లింగమయ్యను పలువురు అభినందించారు.