హర్షితా గాయత్రి పోలను ఆదుకుందాం..
విద్యాదానం చేద్దాం..!
మానవతావాదులకు మనస్ఫూర్తిగా వేడుకలు
అవతలి వారికి ఏది అవసరమో దానిని ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా ఇచ్చేది దానం. దానం ఇవ్వడం చాలా గొప్పని, ఆ దానాల్లోనూ మళ్లీ గొప్ప గొప్పవి, మహా గొప్పవి ఉన్నాయని గొప్పగా ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే, ‘మహా’ అనేది ఎక్కడా స్థిరంగా ఉండదు. ఎక్కడ ఏది గొప్పని భావిస్తే అది అక్కడ మహా గొప్ప దానంగా ప్రాశస్త్యం పొందుతుంది. అన్నదానం, విద్యాదానం, అవయవదానం వంటివి ఆయా సందర్భాలకు అవే మహాదానాలు. భూదానం, గోదానం, కన్యాదానం వంటివి ఉండనే ఉన్నాయి. ఆవులూ భూములూ, మేకలూ మేడలూ సరే సరి… దానమిచ్చువాడు దాత అయితే, లెక్కకు మిక్కిలిగా పెక్కు దానాలిచ్చువాడు మహాదాత. ఇలాంటి మహా దాతృత్వాలు పురాణాల్లో, చరిత్రలో, శిలాశాసనాల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రజాస్వామ్య యుగంలోనూ తరచూ పత్రికల పతాక శీర్షికలకెక్కుతాయి. అదే విధంగా ఓ నిరుపేద విద్యార్థిని షాద్ నగర్ పరిమళం.. మన షాద్ నగర్ వాసి అయిన ఆయుర్వేద వైద్యుడు, కరోనా సమయంలో తన సలహాలను ముందస్తుగా తను తయారు చేసి ఇచ్చిన తెలంగాణ సంజీవిని తైలం వల్ల కరోనా బారీన పడకుండా తప్పించుకున్నాం ఆయనే శివకుమార్ పోల. ఆయన కూతురు హర్షితా గాయత్రి పోల ప్రస్తుతం ఈమె హైదరా బాద్ లొ బీఎస్సి డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ప్రస్తుతం ఆమె తండ్రి శివకుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. తన కూతుర్ని మంచి చదువు చదివించుకోవాలని భావించిన ఆర్థికంగా అది సాధ్యం కావడం లేదు. విద్యాదానం మహాదానం కాబట్టి ఈ నిరుపేద విద్యార్థిని ఎవరైనా ఆదుకొని చదివించిన లేదా ఆర్థిక సహాయం చేసిన ఎంతో గొప్ప విషయం అని హలో షాద్ నగర్ భావిస్తుంది. గాయత్రి షాద్ నగర్ సత్యసాయి స్కూల్ లో 10వ తరగతి, విశ్వభారతి కళాశాలలో బైపిసి ప్రథమ శ్రేణి విద్యార్థిని, ఇపుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతోంది. మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్ట్ లలో మంచి మార్కులే వచ్చాయి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఆ కుటుంబం బాధలో ఉంది. మనమంతా దృక్పథంతో పెద్ద మనసుతో ఈ విద్యార్థినికి సహాయమందించి విద్యా దానం చేయాల్సిన అవకాశం వచ్చింది. ఆ నిరుపేద కుటుంబం పట్ల దయగలిగి ఆ మొదటి శ్రేణి విద్యార్థినిని మనస్పూర్తిగా ఆదుకోవాలని మానవతా దృక్పథంతో కోరుతూ.. గాయత్రి గూగుల్ పే నంబర్ 8143264555 సాయం చేయగలరని మనవి..