అర్హత ఉన్న 12 ఏళ్లగా అందని పింఛను
గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పందించిన ఎమ్మెల్యే శిల్పా
పింఛన్ ధ్రువీకరణ పత్రం అందజేసిన అధికారులు
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 05, మహానంది:
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని బుధవారం గాజులపల్లి గ్రామానికి చెందిన వితంతువు మహిళా మదార్ బీ భర్త చనిపోయి గత 12 సంవత్సరాలుగా తనకు వితంతు పింఛన్ రావటం లేదని ఎమ్మెల్యే శిల్పాకి విన్న వించుకోగా ఆయన తక్షణమే స్పందించి అధి కారులను పింఛను మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారు.రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం అర్హురాలైన మదార్ బీ కి మంజూరైన పింఛన్ ధ్రువీకరణ పత్రంను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు సమస్యలను తక్షణ పరిష్కారం చేస్తున్నారని ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.