చంద్రగిరిలో పాలీహౌస్ ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన జిల్లా ఉద్యాన అధికారి బి.దశరథ రామిరెడ్డి…..
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి పంచాయతీలో పాలీహౌస్ ను క్షేత్రస్థాయిలో జిల్లా ఉద్యాన అధికారి బి.దశరధ రామిరెడ్డి తనిఖీ చేయడం జరిగింది అని చంద్రగిరి మండల ఉద్యాన అధికారి ఎస్.శైలజ గురువారం తెలిపారు.జిల్లా ఉద్యాన అధికారి బి.దశరథ రామిరెడ్డి గురువారం చంద్రగిరి పంచాయతీలో ఎస్.శ్రీనివాసులు రెడ్డి 935 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న పాలీహౌస్ ను క్షేత్ర స్థాయిలో తనికీ చేయడం జరిగిందని తెలిపారు.ఉద్యాన శాఖ అర్ద ఎకరము 2000చ.మీ.పాలీహౌస్ నిర్మాణానికి చదరపు మీటరుకు 445 రూపాయలు,షేడ్ నెట్ హౌస్ ల నిర్మాణానికి చదరపు మీటరుకు 230 రూపాయలు రాయితీ ఇవ్వటమే కాకుండా అందులో సాగు చేసే ఒక కూరగాయ పెంపకానికి చదరపు మీటరుకు 70 రూపాయలు,పూల పెంపకానికి రోజా లేదా చామంతికి చదరపు మీటర్ కి 213 రూపాయలు రాయితీ ఇవ్వటం జరుగుతున్నది.అంతే కాకుండా శాశ్వత పందిరి పై తీగజాతి కూరగాయల పెంపకానికి ఎకరానికి 2,11,750 రూపాయలు ఖర్చు అవతుందని,దీనికి ఉద్యాన శాఖ ఒక లక్ష రూపాయలు రాయితీ ఇవ్వడము జరుగుతుందని,ఈ అవకాశాన్ని రైతులందరూ తప్పకుండా వినియోగించు కోవాలని జిల్లా ఉద్యాన అధికారి తెలిపారు.ఇతర వివరాలకు మండల ఉద్యాన అదికారిని,రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమములో చంద్రగిరి మండల ఉద్యాన అధికారిణి ఎస్. శైలజ,ఉద్యాన ఇంజనీర్ వి.చక్రపాణి రెడ్డి,రైతులు,తదితరులు పాల్గొన్నారు.