జగనన్న పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు- ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 05, మహానంది:
జగనన్న పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.గురువారం మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో 2వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శిల్పా గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రైతు భరోసా, చేయూత, ఆసరా, విద్యా దీవెన, అమ్మ ఒడి, పెన్షన్లు తదితర పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన కొనసాగింధన్నారు, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందని,నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల పింఛన్ అందించడం జరుగుతుందని,అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి ఇవ్వడం జరిగిందన్నారు, స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు తమను కూడా ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శిల్పా కోరారు.అనంతరం గాజులపల్లి గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో దివ్యాంగుల పిల్లలకు మంజూరైన సైకిల్లను ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే శిల్పా అందజేశారు. అలాగే గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాలైన చెంచు పకీరయ్య అనే వ్యక్తికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం గా 5000 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, వైసీపీ నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, గోపవరం సోసైటీ చైర్మన్ వడుగూరి రామకృష్ణుడు,గజ్జ పెద్దపకీరయ్య, ఎంపీటీసీ చౌటుపల్లి నరసింహులు,సర్పంచ్ గడ్డం చంటి,తాసిల్దార్ జనార్దన్ శెట్టి, ఎంపీడీవో శివ నాగజ్యోతి,మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి, ఎస్సై నాగార్జున రెడ్డి,వీఆర్వో వెంకటరాముడు,పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, సచివాలయ సిబ్బంది,వైసిపి నాయకులు, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.