గడప -గడపకు సంక్షేమం
73 వరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
ఎమ్మెల్యే శిల్పాకు ఘన స్వాగతం పలికిన గాజులపల్లె గ్రామ ప్రజలు
భారీ గజమాలతో స్వాగతించిన నాయకులు,
అభిమానులు
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 04, మహానంది:
ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.బుధవారం మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లె గ్రామంలో నిర్వహించిన 73 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే శిల్పా ను భారీ గజమాలతో సత్కరించి,దారి పొడవునా పూల వర్షంతో స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే శిల్పా ప్రతి గడప – గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి మూడేళ్ళ పాలనలో అందించిన సంక్షేమ బుక్ లను అందించడం జరిగింది. అనంతరం ఆయా వీధుల్లో స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ ఎలాంటి అవినీతికి తావు లేకుండా పలు సంక్షేమ పథకాలతో పాటు ప్రజా ప్రయోజనాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా జగనన్న పాలన అందిస్తున్నారన్నారు. సచివాలయ -వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకే అందిస్తున్నారని చెప్పారు, ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా -లేదా ,ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ , ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేలా ముందుకు సాగుతున్నామన్నారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అందచేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి, మహానంది ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, గోపవరం సోసైటీ చైర్మన్ వడుగూరి రామకృష్ణుడు,గజ్జ పెద్దపకీరయ్య, ఎంపీటీసీలు వడుగూరి లక్ష్మీదేవి, చౌటుపల్లి నరసింహులు, సర్పంచ్ గడ్డం చంటి, మహానంది దేవస్థానం ధర్మకర్త గజ్జ సంపూర్ణ, తాసిల్దార్ జనార్దన్ శెట్టి, మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి, ఎస్సై నాగార్జున రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.