*ప్రభుత్వం పెంచిన పింఛన్లు పంపిణీ చేసిన తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి*
పాకాల
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను బుధవారం ప్రారంభించడం జరిగింది.అదేవిధంగా పాకాల మండలంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు,తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,ఎంపీపీ లోకనాథం,మండల నాయకుల ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా వయోవృద్ధులకు ప్రభుత్వం పెంచిన పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు,తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలకు ఆరు నెలల ముందు పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు 2,750 రూపాయలు ఇవ్వడం ఒక జగనన్నకు మాత్రమే సాధ్యమైంది అని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాదికి ఓసారి రూ.250ల చొప్పున పింఛన్ పెంచుతున్న జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని చెప్పారు.ప్రతి నెల ఒకటవ తేదీన వాలంటీర్లు,సచివాలయ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి ఫింఛను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే అని అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవ్వ,తాతలపై అభిమానంతో పింఛన్లు పెంచుకుంటూ పోవడం అభినందనీయం అని చెప్పారు.చంద్రగిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్రపటాలకు పింఛన్ లబ్ధిదారులు పాలాభిషేకం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పెంచిన పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారు జగనన్నను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.