*జహంగీర్ పీర్ దర్గాలో ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం..!*
ఇంత ఫ్రీడం ఎవరిచ్చారు..?
ప్రభుత్వ స్థలాల్లో ఎమైనా చేయొచ్చా..?
ఇవి దేనికీ సంకేతాలు..!? *
ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు..?*
స్వలాభం లేకుంటే ఇన్ని లక్షలు ఎందుకు వెచ్చిస్తారు..?
సంబంధిత అధికారులు చర్యలు చేపట్టరు ఎందుకు..?
హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ప్రభుత్వ పర్యాటక కేంద్రంలో ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యం నడుస్తోంది. డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చననే ధీమా ప్రదర్శితం అవుతుంది. ప్రభుత్వ నియమ నిబంధనలు పక్కనపెట్టి తమకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకునేందుకు ఏకంగా రోడ్లను వేసుకుంటున్నారు. వేసుకుంటే వేసుకున్నారు ఎవడి గోల వాడిది కానీ ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.. కానీ ప్రైవేటు వ్యక్తులకు ఇవేవీ పట్టవు. ప్రభుత్వ స్థలాలు ఏమైనా చేయొచ్చనే ధీమా కనిపిస్తోంది. తమ ఇష్టా రాజ్యానికి ఏ ప్రభత్వ వనరులు వాడుకున్న తప్పులేదని భావిస్తున్నారో ఏమో కానీ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై దృష్టి సారించి చర్యలు చేపడాల్సిన అధికారుల తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఎవడు పడితే వాడు రోడ్డు వేసుకుంటా.. ఇల్లు కట్టుకుంటా అంటే అధికారులు చూసి చూడనట్టు అల్లుడికి రాచమర్యాదలు చేసినట్లు చేస్తున్నారు. అసలు ఇవి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలా? లేక తమ సొంత ప్రాపర్టీలా? అర్థం కాని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చేస్తే ఎవరు కాదనరు, కానీ దానికి ఒక నిబంధనలు ఉంటాయి. వాటిని ధిక్కరించే అధికారం ఎవరికి లేదు. దురదృష్టవశాత్తు షాద్ నగర్ నియోజకవర్గంలో కొత్తూరు మండలం ఇనుముల్ నర్వ గ్రామపంచాయతీ పరిధిలోగల హజరత్ జహంగీర్ పీర్ దర్గా పుణ్యక్షేత్రాన్ని తమ ఇష్టానికి వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది. క్రషర్ మిషన్ కు చెందిన కొందరు వ్యాపారులు తమ వాహనాల రాకపోకల కోసం ప్రభుత్వ రహదారిని సిసి రోడ్డుగా మార్చేశారు. దీనికి అక్కడ రోడ్డుపై చుట్టుపక్కల నివసిస్తున్న పేద ప్రజల దుకాణాలను కూల్చివేశారు. పేద ప్రజల దుకాణాలు కూల్చకపోతే ఈ ఈతంగం వెలుగు చూసేది కాదు. అసలు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ స్థలాల్లో రోడ్డు వేసే హక్కు ఎవరిచ్చారు తేలాల్సి ఉంది. అధికారుల తీరుపై అనుమానాలు జహంగీర్ పీర్ దర్గాలొ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ స్థలాల్లో రోడ్డు వేసుకొని అనుభవించడానికి ఏం హక్కులు, పేటెంట్లు ఉన్నాయో? అధికారులు చెప్పాలి.. ఇంత రాద్ధాంతం జరుగుతున్న అధికారులు నోరు తెరిచి చర్యలు తీసుకుంటామని చెప్పకపోవడం వెనుక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ తరంగం స్థానిక అధికారులకు తెలిసే జరిగిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా ఏవైనా కార్యక్రమాలు చేపడితే సంబంధిత అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాల్సి ఉంటుంది, కానీ అధికారులు ఇప్పటివరకు నోరు మెదపకుండా ఉన్నారంటే ఈ తతంగంతో వారికి పూర్తిస్థాయిలో సంబంధాలు ఉన్నట్లు అవగతం అవుతుంది. ముఖ్యంగా జహంగీర్ పీర్ దర్గా వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న స్థానిక సుపరిండెంట్ అనుమతులు తప్పనిసరి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనుల్లో తీర్మానం ఉండాలి.. అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు దీనిని పర్యవేక్షించాలి కానీ వీరికి ఎవరికీ సంబంధం లేకుండా అక్కడ రోడ్లు వేస్తున్నారు అంటే ఇది దేనికి నిదర్శనం. అంతా మా ఇష్టం అనే చందంగా దర్గాలో ప్రైవేటు వ్యక్తుల రాజ్యం నడుస్తోంది అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార దర్శకంగా ఉండాల్సిన అధికారులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ స్పందించాల్సిన అవసరం ఉంది..