లంపి స్కిన్ వైరస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంప్రదించండి
గ్రామ పశువైద్యాధికారి కిషోర్
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 09, మహానంది:
మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామ పరిధిలోని పాడి పరిశ్రమ పోషన దారులు అందరూ పశువులలో లంపి స్కిన్ వైరస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంప్రదించాలని శుక్రవారం గ్రామ పశువైద్యాధిశాఖ అధికారి కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యశాలలో ఆయన మాట్లాడుతూ వాతావరణం మార్పు, ఇదే టైంలో ఈ వైరస్ వ్యాధి సోకుతుండడంతో పాడి రైతులు ఆందోళనలో పడ్డారన్నారు.ఈ వ్యాధి సోకితే సాధారణంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న పశువులకు 2 లేదా 3 వారాల్లో తగ్గుతుందనీ,వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బలు రావడం,పూర్తిగా బలహీనపడి మేత సరిగ్గా మేయకపోవడం, విరేచ నాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. రైతులు వెంటనే సంప్రదిస్తే తగిన వ్యాక్సిన్లు వేసి వైరస్ ను పూర్తిగా అరికడతమన్నారు.పశువుల మందలో లక్షణాలు కనిపించగానే తమకు సమాచారం ఇవ్వా లని, వ్యాధి సోకిన పశువును ఇతర పశువులకు దూరంగా ఉంచాలని పశువైద్యాధికారి కిషోర్ సూచించారు.ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది , పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.