ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 10, మహానంది:
మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామ పరిధిలోని మాండౌస్ తుపాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ప్రజలందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి శనివారం కోరారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని ఆయన అన్నారు.రైతులు వ్యవసాయ మోటార్, కరెంట్ స్తంభాలు వర్షాల కారణంగా తడచి షాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ముట్టుకోకూడదని, అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉతికిన బట్టలు అరవేసేటప్పుడు ఇనుప తీగలకు లోహపు తీగలకు బట్టలు ఆరవెయ్యకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వర్షాలు కారణంగా షార్ట్ సర్క్యూట్ వచ్చే ప్రమాదం ఉంది కావున మహిళలు అందరూ జాగ్రత్త ఉండాలన్నారు.అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.నీటి ప్రవాహాలు ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరూ వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని కొండా మధుసూదన్ రెడ్డి సూచించారు.