*మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఎంతో ఉపయోగకరం – ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి*
*బహుళ పార్కింగ్ భవనం తిరుపతికి ప్రత్యేక ఆకర్షణ – మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి*
*తిరుపతి*
*తిరుపతి ప్రజలకు, యాత్రికులకు కొత్తగా నిర్మిస్తున్న మల్టీ లెవల్ కార్ పార్కింగ్ భవనం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ పార్శిల్ ఆఫిస్ ఎదురుగా వున్న తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన ఖాళీ స్థలంలో శుక్రవారం మల్టీ లెవల్ కార్ పార్కింగ్ భవన నిర్మాణానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పూజలు నిర్వహించి శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగులో సుమారు 240 కార్లు, 160 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే నిర్మించడం వలన ఇటు బస్టాండ్, రైల్వే స్టేషన్ కు వెల్లె వాహనదారులకు అటు గోవింధరాజస్వామి గుడికి వెల్లె యాత్రికులకు చాలా ఉపయోగకరంగా వుంటుందన్నారు. అంతేకాకుండా యాత్రికులకు, స్థానికులకు ఉపయోగకరంగ వుంటె రెండు మల్టీ ప్లెక్స్ థీయోటర్లు, వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు వుండేలా నిర్మించడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిలు మాట్లాడుతూ 50 కోట్లతో మునిసిపల్ కార్పొరేషన్ స్థలంలో, స్మాక్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల పార్కింగ్ భవనం తిరుపతికి ప్రత్యేక అకర్షణగా నిలుస్తుందన్నారు. తిరుపతి ప్రజలకు, యాత్రీకులకు సంపూర్ణంగా ఉపయోగపడుతూ, ఇటు మునిసిపల్ కార్పొరేషన్ కి ప్రత్యేక ఆదాయ వనరుగా నిలుస్తుందన్నారు. 18 నెలల కాల వ్యవధిలో ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ భవనం పూర్తి చేయడం జరుగుతుందని మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి స్పస్టం చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తాజీన్ వంశీ, రామస్వామి వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, ఎంఈ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ సిబ్బంది రాజశేఖర్, శ్యామ్, సాయి, వైసిపి నాయకులు తాళ్ళూరి ప్రసాద్, దేవదానం, రాజేంధ్ర తదితరులు పాల్గొన్నారు.*