జగనన్న కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 07, మహానంది:
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి తెలిపారు.బుధవారం మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామ పరిధిలోని గుండంపాడు వెళ్లే రహదారిలో ఉన్న జగనన్న కాలనీలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ సంద ర్భంగా కొండా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నాలుగు లక్షల రూపాయల నిధులతో విద్యుత్ ట్రాన్స్ఫారం మరియు 10 స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ప్రతి పేదవానికూ ఇంటి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే ఆ కాలనీలోని గృహ సముదాయాల్లో రోడ్లు, డ్రెయినేజీ, తదితర మౌలిక వసతులు సమకూర్చుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంటి, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్,అసిస్టెంట్ ఇంజనీర్లు వేంకటేశ్వర్లు, అజయ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.