దుమ్ము,ధూళి దులపండి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
షాపుల పట్ల పరిశుభ్రత కూడా ముఖ్యమే ఆ కనబడే దుమ్ము ధూళి దులపండి,షాపులను శుభ్రంగా ఉంచుకొండ ని చిత్తూరు మద్యం డిపో సబ్ ఇన్స్ పెక్టర్ రామకృష్ణ శాస్త్రి సంభందిత సిబ్బంది కి సూచనలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా ప్రోహిభిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ దయాసాగర్ మరియు చిత్తూరు డిపో ఇన్స్ పెక్టర్ లక్ష్మణ రావు ఆదేశాల మేరకు ఆయన బుధ వారం పాకాల పట్టణం లోని వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాల ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఇక్కడి విలేకరులతో ఎస్ఐ మాట్లాడుతూ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది షాపులను శుభ్రంగా ఉంచుకోవడం లేదని ఆ లాంటి దుకాణాలను గుర్తించి శుభ్రం చేయిస్తున్నట్లు చెప్పారు. తాను తన సిబ్బందితో కలిసి షాపులో పనిచేస్తున్న సిబ్బందికి తెలియకుండా ఆయా షాపుల ముందు నిఘా ఉంచి మద్యం కొనుగోలు చేసే మద్యం ప్రియులను ఎంతకు విక్రయిస్తున్నారని అడుగుతూ వస్తున్నామని ఎక్కడ కూడా అధిక ధరలకు అమ్ముటలేదని గుర్తించడం జరిగిందన్నారు. .ఆయా షాపుల్లో నిల్వ గల స్టాకు ను సిబ్బంది సహాయంతో ఆప్ ద్వారా పరిశీలించారు.ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మరియు సూపర్ వైజర్ లు పాల్గొన్నారు.