సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన కొండా మధుసూదన్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 07, మహానంది:
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి అన్నారు. మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని పదో వార్డుకు చెందిన ముల్లా మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కు మంజూరు చేశారు.మంజూరైన 24 వేల రూపాయల చెక్కును బుధవారం వైసిపి నాయ కులు కొండా మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కొండా మధుసూదన్ రెడ్డి మాట్లాడు తూ పేద పరిస్థితిలో ఉన్నవారు సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రఫీ, గ్రామ నాయకుడు బోజ్జయ్య, బిజెపి నాయకులు నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.