*నూతన ఓటు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి*
— తాసిల్దార్ జి.లక్ష్మీపతి..
*_అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు రెవిన్యూ కార్యాలయంలో మంగళవారం తాసిల్దార్ జి.లక్ష్మీపతి అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా వ్యవహరిస్తూ మండలంలోని 18 గ్రామాలలోని నూతన ఓటు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియపై బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఓటు గుర్తింపు కార్డు నమోదు,ఓటు గుర్తింపు కార్డుకి ఆధార్ అనుసంధానం,పేర్లు,చిరునామా తప్పులు సవరణ,ఓటు ట్రాన్స్ఫర్,మరణ ధ్రువీకరణ వంటి సేవలను గత నెల నవంబర్ 9వ తేదీ నుండి మొదలు పెట్టడం జరిగిందని ఈ సేవలను ఈనెల 8వ తేదీలోపు పూర్తి చేయవలెనని అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరికి ఓటు గుర్తింపు కార్డు నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టాలని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆయన ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లుగా కే.జానకి రామయ్య,ఏం.జానకి రాఘవ,రామాయమ్మ,దుర్గాప్రసాద్,సత్యనారాయణ,బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు._*