పెరుగుతున్న లంపిస్కిన్ కేసులు.. పూర్తిస్థాయిలో అందుబాటులో లేని మందులు
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 06, మహానంది:
మహానంది మండలంలోని తిమ్మాపురం, అబ్బిపురం, పుట్టపల్లి, తదితర గ్రామాల్లో లంపిస్కిన్ వ్యాధి కేసులు పెరుగుతుండడంతో పశువుల యజమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంపి స్కిన్ కేసులు నమోదవుతున్న విషయం పశువైద్యాధికారు లకు తెలిసినా పశు వైద్యశాలలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో లేవని పశువుల యజ మానులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే ఆవులు , ఎద్దులు , కోడెలపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. పశువుల యజమానులు వ్యాధి సోకిన పశువులకు రోజుకు రూ. 1000 నుండి రూ. 1500 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పశు వైద్యశాలలో లంపి స్కిన్ వ్యాధికి పూర్తిగా మందులు అందుబాటులో ఉంచాలని పాడి రైతులు కోరారు.