*డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా పాలాభిషేకం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పాకాల మండల ఉప్పరపల్లి యూత్ డెవలప్మెంట్ నెంబర్స్*
*పాకాల* తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి యూత్ డెవలప్మెంట్ నెంబర్స్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకొని చెప్పుకునేదే భారత రాజ్యాంగం.1956 డిసెంబర్ 6 తారీకు పాకాల మండలం ఉప్పరపల్లి యూత్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు అనంతరం యూత్ నెంబర్స్ మాట్లాడుతూ
స్వేచ్ఛ సమానత్వం కి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ధృవ తారగా నిలిచాడు అని
అంధకారం, ఎటు చూసిన గాఢాంధకారం. బానిసత్వం. దుర్భర దారిద్రం. ఇది ఆనాటి భారత దేశంలో విలయ తాడం ఆడింది. ఇక్కడ సాటి మానవుడే సాటి మానవుడిని హీనంగా చూస్తాడు కులాల ఎక్కువ తక్కువల సుడిగుండాల్లో పడి. ఒకరినొకరు ద్వేషించుకుంటూ అందరూ అమానీయంగా నిష్క బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. ఉండడానికి 30 కోట్ల మంది ఉన్నారు కానీ. ఇక్కడ ఏ మనిషి మనిషిగా చూడబడడు. గౌరవం ఎవరికి ఉండవు. ఎవరికి తము ఫలానా కులస్తులమన్న స్పృహ. కొన్ని కులాల వారి కన్నా తాము అదుకులం, అది కులం అన్న స్పృహ తప్ప. తను మనిషి నన్ను స్పృహ ఉండదు. పాలకవర్గాలు మరియు హిందుత్వ విష సంస్కృతి. వారి నలా చేశాయి. ఇటువంటి పరిస్థితులలో ఆయన మనిషిని మనిషిగా చూసి, సగర్వంగా తల ఎత్తుకునేట్లుగా చేశారు. సకల జనుల ఆత్మబంధువుగా మారాడు. మహోన్నతమైన మానతవాదగా సమాజానికి దారులు. వేశాడు తను పుట్టిన గడ్డ మాతృభూమి దేశం అభివృద్ధి చెందాలని. ఎన్నో రాత్రులు నిద్రలేని రోజులు గడిపాడు. అన్ని రంగాల్లోనూ స్వేచ్ఛ సమానత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ లకు దక్కాలని. వీళ్ళ స్వేచ్ఛ కోసం ఇటువంటి అడ్డంకులు ఎదురైన ఎదురొడ్డి నిలిచాడు భారతీయుల కీర్తి పతాక అయినాడు. ఇప్పటికీ ఏ ఊరిలో చూసినా, ఏ సెంటర్లో చూసినా ఆయన స్ఫూర్తిగా అయినా విగ్రహాలే. ఆయన స్ఫూర్తిగా ఆయన విగ్రహం కనిపిస్తుంది అందరికీ ఇప్పటికీ ఆయనే మార్గదర్శడిగా ఉంటాడు. నిత్య స్ఫూర్తి నందు వస్తూనే ఉంటాడు ఎవరాయన ?
*ఆయనే బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన చేతిలో ఉండేది ఏ మత గ్రంథము కాదు. అది అద్వితీయమైన మేధాశక్తితో యక్తులతో. తన దేశ స్వతంత్ర ప్రకటనగా ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకొని చెప్పుకునే అదే భారత రాజ్యాంగం.1956 డిసెంబర్ 6 తారీకున మానవ హక్కుల ప్రధాత మరణించిన రోజు ఈ దేశాన్ని వదిలిన రోజు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి యూత్ డెవలప్మెంట్ నెంబర్స్ .ప్రసాద్. అనిల్. రూపేష్. గిరి. ఊరి పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు