మహానంది క్షేత్రానికి కోటి రూపాయల వరకు పెండింగ్ బకాయిలు
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 05, మహానంది:
మహానంది క్షేత్రానికి వివిధ టెండర్లు ఇతర మార్గాల ద్వారా రావాల్సిన దాదాపు కోటి రూపాయలు పాత బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం.గత కొంతకాలం నుంచి ఈ బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తుంది.అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఎక్కువగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఎన్నోసార్లు పాలకమండలి సమావేశంలో కానీ బహిరంగంగా కానీ స్థానిక ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి బకాయిలు ఉన్నవారు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా చెల్లించాలని పలుమార్లు హెచ్చరించిన కొంతవరకు చెల్లించి మరల చాప చుట్టేసినట్లు సమాచారం.ఆలయ అధికారులు కూడా కొంతమేరకు ఒత్తిడి చేసిన పెండింగ్ బకాయిలు పేరుకుపోతున్నట్లు తెలుస్తుంది.సాధారణంగా మహానంది క్షేత్ర పరిధిలో తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే వారి నుండి ప్రతినెల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు .మరి వీరిపై ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చ నీయాంశంగా మారింది.అధికార ప్రతిపక్షం కాకుండా ఎమ్మెల్యే చెప్పిన మాటలకు కొందరు వక్ర భాష్యం పలుకుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నా యి. ఒక టెండర్లు దారులు దాదాపు 90% చెల్లించి మిగతా మొత్తాన్ని ధరావతు రూపంలో ఉన్న మొత్తాన్ని జమ చేసుకోవాలని సూచించిన అధి కారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ దాదాపు కోటి రూపాయల పైనే బకాయిలు ఉన్నాయని వాటిని త్వరలో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు.దీనివల్ల ఆలయానికి కూడా నష్టం వాటిల్లుతుందని పేర్కొ న్నారు. ధరావత్తు రూపంలో ఉన్న మొత్తాన్ని చివరగా చెల్లిస్తామని ముందు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని టెండర్లు చెల్లించాలని పేర్కొన్నారు.