జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి – సిపిఐ
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 05, మహానంది:
మహానంది మండలంలోని గ్రామాలలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు సామేలు
సోమవారం మహానంది తాసిల్దార్ జనార్దన్ శెట్టి ని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు సామేలు మాట్లాడుతూ జగనన్న కాలనీలల్లో మౌలిక వసతులు కల్పించాలని. ఇంటి నిర్మాణానికి రూ.1,80,000. వేల రూపాయలు ఏమాత్రం సరిపోదని. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయాలన్నారు. బుక్కాపురం గ్రామంలోని అర్హులైన నిరుపేదలందరికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వీరప్ప, సిపిఐ సీనియర్ నాయకురాలు వెంకటమ్మ, సిపిఐ బుక్కాపురం శాఖ కార్యదర్శి, మిద్దె రామేశ్వరయ్య, నాయకులు పుల్లయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.