క్రిమిసంహారక మందు తాగి కోలుకోలేక వృద్ధురాలు మృతి
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 06, మహానంది:
క్రిమిసంహారక మందు తాగి చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది.మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన సంజమ్మ (66) షుగర్ వ్యాధితోబాధపడుతూ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే వారి కుటుంబ సభ్యులు స్పందించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది.ఈమెకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు.ఇతను గత కొనేళ్ల కిందట మృతి చెందాడు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహానంది ఏఎస్ఐ వెంకట కృష్ణుడు మంగళవారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.