దేవుడా.. ఇదేమి కర్మ నాయనా..
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 02, మహానంది:
సీఎం జగన్ పాలనలో దేవుడా మాకు ఇదేమి ఖర్మ రా నాయనా అంటూ మహానంది మండల టిడిపి నాయకులు శ్రీశైలం టిడిపి ఇన్చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సమన్వయకర్త బన్నురు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మహానంది గాజులపల్లె రోడ్డుపై కళ్లకు గంతలు కట్టుకొని శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు గుంతలు పడి నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి నాయకులు గుంతల రోడ్డు లో ప్రమాదం జరుగుతున్న సంఘటనలు తెలియ జేస్తూ కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మహానంది నుంచి గాజులపల్లికి వెళ్లే రహదారిగుంతలమయమై ఎంతోమంది వాహన దారులు నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్న వైసిపి ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో ప్రజా ప్రతిని ధులకు కనువిప్పు కలిగే విధంగా ప్రమాదంలు జరిగి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునే విధంగా నిరసన ప్రదర్శించారు. మహానంది శైవ క్షేత్రానికి ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు వాహనాలపై వస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు అద్వానంగా మారడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. చాలా పర్యాయాలుపత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఈ రోడ్డు అధ్వాన్న పరిస్థితి ని గూర్చి కథనాలు వచ్చిన వైసిపి ప్రజాప్రతినిధులకు ఏమి పట్టనట్లు వున్నారు అని విమర్శించారు. మండల టిడిపి నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అంటూ ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శించారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు పెంచిన విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు,పన్నులు, రాష్ట్ర ప్రజల కూడు గోడు గూడు పట్టించుకోలేదని ఇదేమి ఖర్మరా అంటూ నిరసన తెలిపారు. గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి అక్క అబ్బో నీకు దండిగా డబ్బులు వచ్చినాయే అంటూ ఈ డబ్బులు మళ్ళీ రావాలంటే జగన్ కు ఓటేయాలని ప్రచారం చేయడమే తప్ప ప్రజల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు పట్టిన కర్మ పోవాలంటే జగన్ పోవాలని చంద్రబాబు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉల్లి మధు యూనిట్ ఇంచార్జీలు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కాకర్ల శివ, మండల నాయకులు నాగ పుల్లయ్య, క్రాంతి కుమార్, ఆర్ఎస్ గాజులపల్లె సర్పంచ్ అస్లాం భాష, మౌలాలి, వెంకటాద్రి, వెంకటేశ్వర్లు, రామకృష్ణ , దస్తగిరి , నాగరాజు రంగా, అబ్దుల్, శ్రీనివాసులు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.