జగనన్న కాలనీ లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాలకు ఐదు లక్షలు ఇవ్వాలి.. సీ.పీ. ఐ.
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 02, మహానంది:
డిసెంబర్ 5వ అన్ని మండల కార్యాలయం ఎదుట జరుగు ఆందోళన జయప్రదం చేయండి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్ శుక్రవారం పిలుపునిచ్చారు. మహానందిలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే జగనన్న కాలనీలను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ , జిల్లా సమితి సభ్యులు ఆర్ సామేలు మండల కార్యదర్శి. వీరప్ప, మండల సహాయ కార్యదర్శి మహేశ్వరమ్మ. మండల సమితి సభ్యులు. గురుమూర్తి. మిద్దె రామేశ్వరయ్య పరిశీలించారు. జగనన్న కాలనీలో ఇండ్ల పట్టాలు తీసుకున్నవారు ఇల్లు నిర్మించు కునేందుకు ఇండ్ల నిర్మాణ పనులు చేయకపోవడంతో ఆ ప్రాంతమంతా ముళ్ల కంపలు, చెత్తాచెదారంతో నిండిపోవడం విచారకరము. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫకృద్దీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు జగనన్న కాలనీ పేరుతో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని వారు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే ₹1,80,000 ఏమాత్రం సరిపోవటం లేదని ప్రస్తుత ధరల ఆధారంగా ఇళ్ల కు గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఒకటిన్నర సెంట్లు పట్టా భూములు ఇచ్చి నిర్మాణాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షలు పట్టణ ప్రాంతాల్లో ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 5వ తేదీన అన్ని మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల ఎదుట లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేయాలని వారు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.