అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
బండారు సత్య నందరావు
రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్, కరెంటు,ఆర్టీసీ చార్జీలు పెంపుడు నిరసిస్తూ వాడపల్లి లో శుక్రవారం ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం ప్రారంభించారు. గ్రామములో ఇంటింటికి వైసిపి ప్రభుత్వ అసమర్థ , అరాచక పాలనను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అధి వైసిపి ప్రభుత్వం అని విమర్శించారు. ఏ చిన్న గ్రామానికి వెళ్ళాలన్నా రోడ్లు సరిగ్గా లేనందున ప్రజలు సాహసం చేయాల్సి వస్తుంది,ప్రమాదాలకు నిలయాలుగా మారిన రోడ్లు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం మరమత్తులు కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేతగాని ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు, దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తూ వైసీపీ ఏజెంట్లను పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. నగదు బదిలీ పథకాలతో ప్రజలను మోసం చేస్తూ నిత్యవసరాలతో పాటు అన్ని ధరలు పెంచి పన్నులతో బాదుడే బాదుడు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ, జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని, సామాన్యులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,జగన్ కి ఓటు వేసిన వారే ఇప్పుడు ఇదేం కర్మ అని వాపోతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న పధకాలు జగన్ ప్రభుత్వం రద్దు చేయడం వలన ఆయా వర్గాల వారు అసహనంతో వున్నారని, ఇంకా అనేక ఇబ్బందులతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ మా ఖర్మ ఏంచేస్తాము అని బాధపడుతున్నారని , వారికి తెలుగుదేశం పార్టీ అండగా వుంటుందని తెలియజేశారు. పార్టీ ఆదేశించిన మేరకు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి ప్రజలను చైతన్య పరుస్తామని, తద్వారా రాష్ట్రానికి పట్టిన ఖర్మను వదిలిస్తామన్నారు.